43 మంది దుర్మరణం

సెంట్రల్ ఢిల్లీ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 43 మంది మృత్యువాత పడగా మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్ ఢిల్లీ [more]

Update: 2019-12-08 06:05 GMT

సెంట్రల్ ఢిల్లీ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 43 మంది మృత్యువాత పడగా మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్ ఢిల్లీ లోని అనాజ్ మండి ప్రాంతంలో ఈ ప్రమాదం ఈ రోజు తెల్లవారు జామున చోటు చేసుకుంది. ప్లాస్టిక్ తయారీ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు వున్నాయి. ప్రమాదం సంభవించిన వెంటనే దట్టమైన పొగ అమలు కోవడం తో ఫ్యాక్టరీ సమీపంలో వుండే కార్మికుల నివాసాల్లోకి ఇది వ్యాపించి వారికి ఊపిరి ఆడలేదు.

ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో….

అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్న సమయంలోనే 20 మంది చనిపోయారు. గతంలో ఢిల్లీ లో 56 మంది చనిపోయిన సంఘటన తరువాత ఇదే అతిపెద్ద దుర్ఘటన. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలతో బాటు ఎన్డీఆర్ఫ్ బృందాలు రంగం లోకి దిగి రిస్క్యూ మొదలు పెట్టాయి. ఈ సంఘటనపై ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లు దిగ్బ్రాంతి ని వ్యక్తం చేశారు.

Tags:    

Similar News