ఐటీ గ్రిడ్ కేసులో కీలకమలుపు….!!!

ఐటీ గ్రేడ్ కేసులో కీలక మలుపు తిరిగింది . ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక కోసం సిట్ అధికారులు ఇప్పటి వరకూ వేచి చూశారు. ఎట్టకేలకు [more]

Update: 2019-04-17 02:35 GMT

ఐటీ గ్రేడ్ కేసులో కీలక మలుపు తిరిగింది . ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక కోసం సిట్ అధికారులు ఇప్పటి వరకూ వేచి చూశారు. ఎట్టకేలకు సిట్ అధికారులకు ఫోరెన్సిక్ నివేదిక అందింది . ఐటీ గ్రేడ్ పై కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ గ్రేడ్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లు అన్నింటినీ సిట్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. దాదాపు నెల రోజుల పాటు ఫోరెన్సిక్ అధికారులు డేటా మొత్తాన్ని కూడా పరిశీలించారు. ఫోరెన్సిక్ అధికారులు మొత్తం 40 హార్డ్ డిస్క్ లను అనాల్సిస్ చేసి సంబంధించిన తుది నివేదికను సిట్ అధికారులకు అందజేశారు. ఈ నివేదికలో చాలా కీలకమైన అంశాలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఐటీ గ్రేడ్ కార్యాలయం ..ప్రభుత్వ సంస్థల నుంచే ఈ డాటా ను పూర్తిగా తీసుకున్నట్టుగా అధికారికంగా తేలింది.. ఈ డాటాను ఎక్కడ నుంచి తీసుకున్నారు? ఏ విధంగా కార్యాలయానికి చేరింది? దీనిని ఎవరు అధికారికంగా తెచ్చుకున్నారు..? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మరోవైపు ఐటీ గ్రిడ్ కేసులో నిందితుడు అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News