బ్రేకింగ్ : కడప ఉక్కు ఫ్యాక్టరీకి కొబ్బరికాయ

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ సీఎం స్పీడుపెంచారు. ఈరోజు ఉదయం సచివాలయ శాశ్వత నిర్మాణ కాంక్రీట్ పనులను ప్రారంభించిన ఆయన కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీకి [more]

Update: 2018-12-27 06:12 GMT

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ సీఎం స్పీడుపెంచారు. ఈరోజు ఉదయం సచివాలయ శాశ్వత నిర్మాణ కాంక్రీట్ పనులను ప్రారంభించిన ఆయన కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. మైలవరం మండలం కంభాలదిన్నె గ్రామంలో ఆయన భూమి పూజ చేశారు. ఈ ఉక్కు ఫ్యాకర్టరీకి గండికోట జలాశయం ద్వారా నీరందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. మొత్తం 2700 ఎకరాల్లో 18 వేల కోట్లతో ఈ ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణపట్నం ఓడరేవు ద్వారా విదేశాల నుంచిబొగ్గు దిగుమతి చేసుకోనున్నారు.

Tags:    

Similar News