ఏపీ, తెలంగాణాల్లో టాప్ లెవెల్లో కరప్షన్...తాజా సర్వేలో వెల్లడి

Update: 2018-10-12 10:43 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో అవినీతి ఎక్కువేనని తాజా సర్వేలో తేలింది. తెలంగాణ, ఏపీలలోని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వనిదే పనులు కావడం లేదని ప్రజలు తాజా సర్వేలో చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం తాము లంచాలు ఇచ్చామని 43 శాతం మంది ప్రజలు వెల్లడించారు. నోయిడాకు చెందిన సోషల్ మీడియా వేదిక 'లోకల్ సర్కిల్స్' చేసిన ఇండియా అవినీతి సర్వే 2018లో తెలంగాణ అధికారుల అవినీతి వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రంలో పౌరసేవల కోసం తాము లంచం ఇచ్చామని 43 శాతం మంది ప్రజలు ముక్తకంఠంతో చెప్పారు. అవినీతిలో తెలంగాణ 8 వ స్థానంలో నిలిచిందని సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2017లో అవినీతిలో ఆరోస్థానంలో నిలవగా ఈ ఏడాది 11వస్థానానికి వచ్చింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో....

మొత్తం మీద రెండు తెలుగురాష్ట్రాల్లో అవినీతి ఎక్కువేనని సర్వేలో వెలుగుచూసింది. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లలో 68 శాతం అక్రమాలు సాగుతున్నాయని తేలింది. పోలీసు, మున్సిపల్ కార్పొరేషన్లలో అవినీతి ఎక్కువగానే ఉందని సర్వేలో వెల్లడైంది. ఏపీలో 60 శాతం అవినీతి రిజిస్ట్రేషన్ల శాఖలో ఉందని, అనంతరం పోలీసు, విద్యుత్ బోర్డు, రవాణ శాఖల్లో అమ్యామ్యాలు అధికంగా తీసుకుంటున్నారని తేలింది.భూముల రిజిస్ట్రేషనుకు, పోలీసులకు తాము లంచం ఇచ్చామని 48 శాతం మంది తెలుగుప్రజలు వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయడంతోపాటు లోకాయుక్తను పటిష్టం చేసినప్పుడే అవినీతిని తగ్గించవచ్చని లోకల్ సర్కిల్స్ ఛైర్మన్ సచిన్ తపారియా చెప్పారు.

Similar News