ఆగినట్లే ఆగి.. తెలంగాణలో మళ్లీ పెరుగుతున్నాయ్

తెలంగాణలో క్రమంగా కరోనా వైరస్ మళ్లీ పెరుగుతోంది. కరోనా వ్యాప్తి తగ్గిందని భావిస్తున్న ప్రభుత్వానికి రోజూ పెరుగుతున్న కేసులు షాకిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో మరో 33 కేసులు [more]

Update: 2020-05-11 02:47 GMT

తెలంగాణలో క్రమంగా కరోనా వైరస్ మళ్లీ పెరుగుతోంది. కరోనా వ్యాప్తి తగ్గిందని భావిస్తున్న ప్రభుత్వానికి రోజూ పెరుగుతున్న కేసులు షాకిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో మరో 33 కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లో 26 కేసులుండగా, మిగిలినవి ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారితో నమోదయ్యాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1196కు చేరుకుంది. 415 మంది కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్నారు. 751 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రతి రోజు 30కి తగ్గకుండా కేసులు నమోదవుతుండటంతో అధికారుల్లో తిరిగి ఆందోళన ప్రారంభమయింది.

Tags:    

Similar News