వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు

Update: 2018-08-09 07:56 GMT

మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్వాహకులకు విజయవాడలోని వినియోగదారుల ఫోరం మొట్టికాయలు వేసింది. విజయవాడలోని ఐదు మల్టీప్లెక్స్ లలోకి బయట నుంచి తినుబండారాలను తీసుకెళ్లవచ్చని ఫోరం తీర్పునిచ్చింది. విజయవాడలోని మల్టీప్లెక్స్ లలో అధిక ధరలను తినుబండారాలను అమ్ముతున్నారని సిద్ధార్థ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ దివాకర్ రావు వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించారు. దీనిపై ఫోరం కఠినమైన తీర్పు ఇచ్చింది. అధిక ధరలకు అమ్ముతున్న కోకోకోలా, పెప్సీ, రెడ్ బుల్, ఆక్వాఫినా, కిన్లే కంపెనీలకు రూ.ఐదు లక్షల చొప్పుల జరిమానా విధించింది. విజయవాడలోని పీవీపీ, ట్రెండ్ సెట్, పీవీఆర్, ఎల్ఈపీఎల్, ఐనాక్స్ మాల్స్ కు ఐదు వేల చొప్పుల జరిమానా విధించింది. ఈ జరిమానాను వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది. ఇక నుంచి ఎంఆర్పీ ధరలకే తినుబండారాలను అమ్మాలని కచ్చితంగా తేల్చింది. అమ్మకాలు జరిగే చోట తూనికలు, కొలతల శాఖ ఫోన్ నంబర్లు ప్రదర్శించాలని చెప్పింది. ఎక్కడైనా ఎక్కువ ధరలకు అమ్మితే వెంటనే వారికి ఫోన్ చేయాని ప్రజలకు సూచించింది.

Similar News