బ్రేకింగ్: సీపీఐ రామకృష్ణకు సొంత పార్టీలోనే?

సీపీఐలో అమారావతి రాజధాని అంశం చిచ్చురేపింది. సీపీఐలో విభేదాలు భగ్గుమన్నాయి. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని కర్నూలు జిల్లా సీపీఐ సమావేశం అభిప్రాయపడింది. [more]

Update: 2020-01-13 06:14 GMT

సీపీఐలో అమారావతి రాజధాని అంశం చిచ్చురేపింది. సీపీఐలో విభేదాలు భగ్గుమన్నాయి. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని కర్నూలు జిల్లా సీపీఐ సమావేశం అభిప్రాయపడింది. చంద్రబాబుతో కలసి నడుస్తున్న రామకృష‌్ణ తీరును కర్నూలు శాఖ తప్పుపట్టింది. అధికార వికేంద్రీకరణకు అనుకూలంగా పార్టీ తీర్మానం చేసింది. విద్యార్థులను ఉద్యమంలోకి రావాలని పిలుపునివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై చంద్రబాబు కేసులు పెట్టింది నిజం కాదా? అని ప్రశ్నించింది. అమరావతిని తాత్కాలిక రాజధానిగా మార్చింది చంద్రబాబు మాత్రమేనని సీపీఐ కర్నూలు శాఖ అభిప్రాయపడింది.

Tags:    

Similar News