హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిరుత

అధికారులతో చిరుత దాగుడుమూతలు ఆడుకుంటుంది. నాలుగు వారాల నుంచి చిరుత అధికారుల చిక్కకుండా దోబూచులాడుతుంది. చిరుత కోసం అహర్నిశలు ఎనిమిది బృందాలు పనిచేస్తున్నాయి. అయినా చిరుత ఆచూకీ [more]

Update: 2020-06-09 06:43 GMT

అధికారులతో చిరుత దాగుడుమూతలు ఆడుకుంటుంది. నాలుగు వారాల నుంచి చిరుత అధికారుల చిక్కకుండా దోబూచులాడుతుంది. చిరుత కోసం అహర్నిశలు ఎనిమిది బృందాలు పనిచేస్తున్నాయి. అయినా చిరుత ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. శివారు ప్రాంతాల్లో మరొకసారి చిరుత కలకలం సృష్టించింది . గత నాలుగు వారాల నుంచి రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుంది. ఇప్పటికీ ఎనిమిది చిరుతను పట్టుకోవడానికి 8 బృందాలు పనిచేస్తున్నాయి. ట్రాప్ కెమెరాలతో పాటు నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు .మరోవైపు హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాలలో 900 ఎకరాల అటవీ భూమి ప్రాంతంలోనే చిరుత ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిన్న రాత్రి రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ లోని నారమ్ గెస్ట్ హౌస్ సమీపంలో చిరుత కనిపించింది. గెస్ట్ హౌస్ ప్రాంతంలో ఉన్న ఒక ఇంటి వద్ద చిరుత తిరుగుతున్న సి సి ఫుటేజ్ లభ్యమైంది.

Tags:    

Similar News