కేసీఆర్ కు కష్టకాలమే....!!!

Update: 2018-11-21 06:41 GMT

తెలగాణలో ఎమ్మెల్యేలను ఊళ్లలోకి రానివ్వని పరిస్థితి నెలకొందని, దీనికి కేసీఆర్ స్వయంకృతాపరాధమే కారణమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఒంటెత్తు పోకడలను అవలంబించడం వల్లనే ఎంపీలు సయితం పార్టీని వీడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇదే పరిస్థితి మీకు రాకుండా చూసుకోవాలని, జనంలో తిరిగి మంచి పేరు సంపాదించుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు.

ఆ ముగ్గురూ ఒక్కటే.....

తాను జాతీయ రాజకీయాల్లో బీజేపీయేతర పార్టీలను ఏకం చేయాలని ప్రయత్నిస్తుంటే కేసీఆర్, జగన్, పవన్ లు దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలు ఒక తానులో ముక్కలేనన్నారు. పవన్, జగన్ లు తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. మోదీని ఎందుకు విమర్శించడం లేదో ఈ ముగ్గురు ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దేశ భద్రతను బీజేపీ ప్రమాదంలోకి నెడుతున్నందునే తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

Similar News