పులివెందుల పంచాయతీని సహించం

శాసనసభలో తనకు మైకు ఇవ్వడం లేదంటూ వరసగా నాలుగో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని [more]

Update: 2019-07-26 10:58 GMT

శాసనసభలో తనకు మైకు ఇవ్వడం లేదంటూ వరసగా నాలుగో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇప్పటి దాకా 285 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేశారన్నారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమకేసులు పెడుతున్నారని, 70 ఏళ్ల వారిపైన కూడా కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రమంతటా పులివెందుల పంచాయతీని అమలు చేస్తున్నారన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. లేకుంటే తాము చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలకు భద్రత, భరోసా ఇవ్వాలని చంద్రబాబు కోరారు. రౌడీయిజాన్ని తాము సహించేది లేదన్నారు. తమను బెదిరించాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన జగన్ ను హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యను రాష్ట్రంలో మెరుగుపర్చండని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News