ఏపీలో టెస్టులు సరిగా చేయడం లేదు

కరోనా నియంత్రణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వం వాస్తవాలను చెప్పాలన్నారు. అనేక [more]

Update: 2020-04-06 08:04 GMT

కరోనా నియంత్రణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వం వాస్తవాలను చెప్పాలన్నారు. అనేక దేశాల్లో వెంటిలేటర్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ పరిస్థితి మనకు రాకుండా చూడాలన్నారు. ఏపీలో కరోనా టెస్టులు సరిగా చేయడం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు మరో ప్యాకేజీ ఇవ్వాలన్నారు. ఇప్పటికే పనులు లేక అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఐదువేల రూపాయలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం కూడా కుటుంబానికి ఐదు వేలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 18 లక్షల మంది కార్డులును తొలగించారని, ఇది సబబు కాదని చంద్రబాబు అన్నారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే బియ్యం, కందిపప్పును కూడా ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు ఇవ్వాలన్నారు. మెడిటెక్ పార్కును పెట్టిందే వైద్య పరికరాలను తయారు చేసేందుకు తాము పెట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. తాను ఎప్పుడో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేశానని, ఇప్పుడు దేశమంతా ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News