ఒక్కసారి ఛాన్స్ అంటేనే?

జగన్ ఒక్కసారి ఛాన్స్ అంటే ఓటేశారని, ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అభివృద్ధిని పూర్తిగా ఆపేసి అరాచకాలకు జగన్ ప్రభుత్వం తెరదీసిందని చంద్రబాబు [more]

Update: 2020-02-19 11:34 GMT

జగన్ ఒక్కసారి ఛాన్స్ అంటే ఓటేశారని, ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అభివృద్ధిని పూర్తిగా ఆపేసి అరాచకాలకు జగన్ ప్రభుత్వం తెరదీసిందని చంద్రబాబు మండి పడ్డారు. తాను ఇప్పుడు అధికారంకోసం ఇక్కడకు రాలేదని, ప్రజలను కాపాడుకోవడం కోసమే వచ్చానని చెప్పారు. ప్రజా చైతన్య యాత్రలను ప్రారంభించిన చంద్రబాబు అనేక చోట్ల ప్రసంగించారు. ఇది రద్దుల ప్రభుత్వమని, అసమర్థ సర్కార్ అని విమర్శించారు. ప్రతి రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుందన్నారు. ఏపీకి రాజధాని అమరావతి మాత్రమేనని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక తాము ఉచితంగా ఇస్తే, జగన్ ప్రభుత్వం మాత్రం దోపిడీకి దిగుతుందన్నారు.

అక్రమ కేసులు పెట్టి…..

టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి శాడిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారన్నారు. శారీరకంగా, మానసికంగా పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకే జగన్ ప్రభుత్వం ప్రయతనిస్తుంద్నారు. మద్యనిషేధం అని చెప్పి జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇక విద్యుత్తు ఛార్జీలను కూడా పెంచి జగన్ ప్రజల నడ్డి విరిచేందుకు ప్రయత్నిస్తున్నారని చెకప్పారు. చివరకు ప్రజలు చొక్కా వేసుకున్నా పన్ను వేసేలా ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News