చంద్రబాబు ఇరుక్కున్నట్లేనా?

ఆదాయపు పన్ను శాఖ గత ఐదు రోజులు జరిపిన దాడుల్లో పెద్దయెత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆ శాఖ నిర్ధారించింది. ముఖ్యంగా ఈ దాడుల్లో చంద్రబాబు మాజీ [more]

Update: 2020-02-13 14:40 GMT

ఆదాయపు పన్ను శాఖ గత ఐదు రోజులు జరిపిన దాడుల్లో పెద్దయెత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆ శాఖ నిర్ధారించింది. ముఖ్యంగా ఈ దాడుల్లో చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్ ఇంటిపై ఐదు రోజుల పాటు ఐటీ శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. మాజీ పీఏ శ్రీనివాస్ అప్రూవర్ గా మారడంతో సాక్ష్యాలు ఐటీశాఖకు లభించాయి. అలాగే కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కంపెనీలు, ఇళ్లపై కూడా ఐటీ శాఖ దాడులు జరిగాయి. దాదాపు రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటీ శాఖ స్వయంగా చెప్పడం ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశమైంది. ఐటీ శాఖ తన ప్రకటనలో పేర్లు చెప్పనప్పటికీ ఇటీవల జరిగిన దాడులు చంద్రబాబు సన్నిహితుల కంపెనీలు, ఇళ్లపైనే అన్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు మాజీ పీఏ ఇచ్చిన సమాచారం మేరకు తాము దాడులు చేసినట్లు ఐటీ శాఖ తెలపడం సంచలనం కలిగించింది.

Tags:    

Similar News