జగనా విలువలు గురించి మాట్లాడేది?

జగన్ విలువలను గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శాసనమండలి రద్దు అంశంపై ఆయన మాట్లాడారు. ఉన్నత ఆశయాలతో ఏర్పడిన మండలిని రద్దు [more]

Update: 2020-01-27 14:22 GMT

జగన్ విలువలను గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శాసనమండలి రద్దు అంశంపై ఆయన మాట్లాడారు. ఉన్నత ఆశయాలతో ఏర్పడిన మండలిని రద్దు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగ నిర్మాతలు ముందుచూపుతోనే రెండు సభలను ఏర్పాటు చేశారన్నారు. శాసనమండలి రద్దు తీర్మానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మండలిని రద్దు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్నారు. 86 మంది వైసీపీ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులున్నాయన్నారు. శాసనమండలికి జగన్ ప్రభుత్వం రాజకీయాలను ఆపాదించిందన్నారు. మొదట స్పీకర్ తీర్మానానికి అనుకూలంగా 121 మంది ఓటేశారని ప్రకటించి, తర్వాత 133 మంది అని ప్రకటించారన్నారు.

నేరస్థుల ముఠాగా…..

వైసీపీీ ఎమ్మెల్యేలు నేరస్థుల ముఠా అని అన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని తాము వ్యతిరేకించలేదన్నారు. మాతృభాషను కాపాడుకోవాలన్నదే తమ అభిమతమని చంద్రబాబు చెప్పారు. తమ ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నారని చెప్పారు. వల్లభనేని వంశీ, మద్దాలిగిరిలను పార్టీని ఎందుకు వీడారో జగన్ కు తెలియదా? అని ప్రశ్నించారు. శాసనమండలికి అరవై కోట్లు ఖర్చవుతుందని చెప్పిన జగన్ వారానికి ఒకసారి కోర్టుకు వెళితే 30 కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు చెప్పారు. తన విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు.

Tags:    

Similar News