టెలీకాన్ఫరెన్స్ లో ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా రాజకీయాలపై ఆయన వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ [more]

Update: 2019-01-11 05:33 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా రాజకీయాలపై ఆయన వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. 30 ఏళ్ల చరిత్రను 3 గంటల్లో అద్భుతంగా చూపించారని ఆయన కొనియాడారు. రాజకీయ నాయకులు, సినీ నటులు, సమాజ సేవకులకు ఎన్టీఆర్ ఎంతో స్ఫూర్తిగా నిలిచారని, తుఫాన్లలో బాధితులను ఆదుకోవడం కూడా ఎన్టీఆర్ నేర్పిందేనని కీర్తించారు. నిన్న చంద్రబాబు చిత్రబృందంతో కలిసి కథానాయకుడు చిత్రాన్ని వీక్షించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News