రాజధాని నా డ్రీమ్ ప్రాజెక్ట్

తాను అనుభవమున్న ముఖ్యమంత్రినని, కొందరికోసమే తాను రాజధానిని నిర్మించానని చెప్పడం అవాస్తవమని ప్రతిపక్షనేత చంద్రబాబు తెలిపారు. తాను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణం చేయాలనుకున్నానని చెప్పారు. [more]

Update: 2019-12-17 11:58 GMT

తాను అనుభవమున్న ముఖ్యమంత్రినని, కొందరికోసమే తాను రాజధానిని నిర్మించానని చెప్పడం అవాస్తవమని ప్రతిపక్షనేత చంద్రబాబు తెలిపారు. తాను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణం చేయాలనుకున్నానని చెప్పారు. తన మీద అపార నమ్మకం ఉండబట్టే 30 వేల ఎకరాలు భూమిని రైతులు ఉచితంగా ఇచ్చారన్నారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని అంటూ ఏమీ లేకుండా పోయిందని, అందరూ ఈర్ష్య పడేలా రాజధానిని నిర్మిద్దామని తాను భావించాలనుకోవడం నేరమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థలకు భూములను తక్కువ ధరకు కేటాయించానన్నారు. రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే పదమూడు జిల్లాలకూ ఆదాయ వనరుగా ఉండేదన్నారు. అనంతపురంలో కియా పరిశ్రమ తనవల్లే వచ్చిందన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ట్రిపుల్ ఐటీ ఇచ్చామని తెలిపారు. తనను వైసీపీ నేతలు అనరాని మాటలు అంటుంటే బాధ కలుగుతుందన్నారు.

Tags:    

Similar News