అమరావతిని కదలించొద్దు.. రాష్ట్రానికి నష్టం

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు మరోసారి కోరారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ కోసం నిర్మించిన నగరమన్నారు. ఇక్కడ తత్కాలిక భవనాలను ఏవీ లేవని చెప్పారు. దాదాపు 62 ప్రాజెక్టులను [more]

Update: 2020-08-14 13:06 GMT

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు మరోసారి కోరారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ కోసం నిర్మించిన నగరమన్నారు. ఇక్కడ తత్కాలిక భవనాలను ఏవీ లేవని చెప్పారు. దాదాపు 62 ప్రాజెక్టులను అమరావతిలో ప్రారంభించామని, వాటి విలువ 53 వేల కోట్లు అని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో భవనాలను అమ్మడం దుర్మార్గమైన చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా రాజధాని గుంటూరు – విజయవాడల మధ్యలోనే ఉండాలని సిఫార్సు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతిని తరలించి రాష్ట్రానికి ఈ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని చంద్రబాబు మండి పడ్డారు. అమరావతిని రాజధానిగానే కొనసాగించి విశాఖ, తిరుపతిలను మహానగరాలుగా అభివృద్ధి చేయవచ్చని చంద్రబాబు సూచించారు.

Tags:    

Similar News