కులం కోసం కాదు.. కుటుంబం కోసం కాదు

హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ కు అనేక పరిశ్రమలు వచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అందుకే అమరావతిని రాజధానిని చేశామన్నారు. అన్నీ అనుకూలంగా ఉన్నాయనే [more]

Update: 2020-08-07 12:21 GMT

హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ కు అనేక పరిశ్రమలు వచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అందుకే అమరావతిని రాజధానిని చేశామన్నారు. అన్నీ అనుకూలంగా ఉన్నాయనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామన్నారు. అమరావతిలో 139 ప్రాజెక్టులు వచ్చేలా ఏర్పాటు చేశామని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని ఏవీ పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్ లో ఏ కులం చూసి తాను అభివృద్ధి చేశానని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతికి ప్రఖ్యాత యూనివర్సిటీలు వచ్చేలా చేశామని చెప్పారు. ఆదాయాన్ని సమకూర్చే కామధేనువు లాంటి ప్రాజెక్టు అమరావతి అని చంద్రబాబు తెలిపారు. అమరావతిని ధ్వసం చేస్తే ఆదాయం ఎలా వస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు.

విశాఖ అంటే నాకు ప్రేమ…

విశాఖ అంటే తనకు ఎనలేని ప్రేమ అని చంద్రబాబు అన్నారు. అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు తాను కృషి చేశానన్నారు. అక్కడే అన్ని సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు శ్రీకారం చుట్టామన్నారు. జగన్ కు అమరావతి అంటే ఎందుకంత కోపమన్నారు. ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమే అమరావతి అని చంద్రబాబు చెప్పారు. మూడు రాజధానులు పెడితే శ్రీకాకుళం వాసులు కర్నూలుకు ఎలా వెళతారన్నారు. 50 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు రాజధాని విజయవాడలోనే ఉండాలని కోరుకున్నారన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చంద్రబాబు చెప్పారు.

కులం జగన్ వచ్చిన తర్వాతనే…

అమరావతి తన స్వార్థం కోసం కాదని, కులం కోసం కాదని, కుటుంబం కోసం కాదని చంద్రబాబు తెలిపారు. జగన్ వచ్చిన తర్వాతనే కుల ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇప్పటికైనా మేల్కొని అమరావతిని కొనసాగించాలని చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమరావతి కోసం అందరం కలసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. శాశ్వతంగా మనం నష్టపోకుండా ఉండాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. కరోనాను నియంత్రించడంలోనూ ప్రభుత్వం విఫలమయిందని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News