ఒక్కటి చేద్దామని

ఈ నెల 14వ తేదీన చంద్రబాబు దీక్షను విజయవంతం చేసేందుకు టీడీపీ సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా, ఇసుక కొరతకు నిరసనగా [more]

Update: 2019-11-10 01:44 GMT

ఈ నెల 14వ తేదీన చంద్రబాబు దీక్షను విజయవంతం చేసేందుకు టీడీపీ సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా, ఇసుక కొరతకు నిరసనగా చంద్రబాబు విజయవాడలో ఒకరోజు దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు మద్దతుగా విపక్షాలను ఒకతాటిపైకి తేవాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది. చంద్రబాబు దీక్షకు జనసేన, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీలు మద్దతు ప్రకటించాయి. సీపీఎం మాత్రం దూరంగా ఉంది. దీక్షతో పాటు విపక్షాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన జనసేన లాంగ్ మార్చ్ కు టీడీపీ మద్దతు ప్రకటించింది. జగన్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News