రెండేళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్

సరిగ్గా రెండేళ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను విశాఖ ఎయిర్ పోర్టులోనే పోలీసులు నిర్బంధించారు. జగన్ ను ఎయిర్ పోర్టు నుంచి బయటకు అడుగు [more]

Update: 2020-02-27 11:09 GMT

సరిగ్గా రెండేళ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను విశాఖ ఎయిర్ పోర్టులోనే పోలీసులు నిర్బంధించారు. జగన్ ను ఎయిర్ పోర్టు నుంచి బయటకు అడుగు పెట్టనివ్వలేదు. దీంతో జగన్ రన్ వే పైనే బైఠాయించారు. దీంతో కొన్ని గంటల తర్వాత జగన్ ను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆయనను తిరిగి విశాఖ ఎయిర్ పోర్టు నుంచి వెనక్కు పంపారు. ఇది 2017 జనవరి 26వ తేదీన జరిగింది. అప్పట్లో విశాఖలో పార్టనర్ సమ్మిట్ జరుగుతుండటంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని జగన్ ను విశాఖలో కి ఎంటర్ కానివ్వకుండా అరెస్ట్ చేసి తిరిగి పంపారు.

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు….

సరిగ్గా రెండేళ్ల తర్వాత సేమ్ సీన్ అదే విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు ఎదురుకావడం విశేషం. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేత. అయితే చంద్రబాబు టూర్ కు అన్ని పర్మిషన్లు పోలీసులు ఇచ్చారు. కానీ ఎయిర్ పోర్ట్ బయట అంతా వైసీపీ కార్యకర్తలు బైఠాయించి ఉండటంతో శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని పోలీసులు భావించారు. దీంతో చంద్రబాబుకు 151 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచే వెనక్కు పంపేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం విశాఖ ఎయిర్ పోర్టు ఇలా ఇద్దరి అగ్రనేతల విషయంలో అరెస్ట్ కు వేదికగా మారింది.

Tags:    

Similar News