ఇలాంటి ప్రధానిని ఇంతవరకు చూడలేదు

70 ఏళ్లలో నరేంద్ర మోడీ లాంటి జవాబుదారీతనం లేని ప్రధానిని ఇంతవరకు చూడలేదని, ఆయన తన పదవీకాలంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు [more]

Update: 2019-05-09 11:48 GMT

70 ఏళ్లలో నరేంద్ర మోడీ లాంటి జవాబుదారీతనం లేని ప్రధానిని ఇంతవరకు చూడలేదని, ఆయన తన పదవీకాలంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. నరేంద్ర మోడీపై ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించారు. ఎప్పుడూ లేనంతగా రాజ్యాంగ వ్యవస్థల మధ్య అంతకలహాలు రేపిన పాలన కూడా మోడీదేనని ఆరోపించారు. దేశంలో మొదటిసారి నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బయటకొచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లు చెప్పారని గుర్తు చేశారు. దేశ చరిత్రలో తొలిసారి సాక్షాత్తూ రక్షణ శాఖ కార్యాలయంలోనే దేశ భద్రతకు సంబంధించిన రాఫేల్ పత్రాలు మాయం కావడం ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశారన్నారు. ఏటీంలను దిష్టిబొమ్మలుగా చేశారని ఆరోపించారు. డిమానిటైజేషన్ ను పెద్ద కుంభకోణంగా మార్చారన్నారు. జీఎస్టీ సక్రమంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. రూపాయి విలువ దారుణంగా పతనమయ్యిందని, 72 ఏళ్లుగా స్వతంత్ర భారత చరిత్రలో ఇంత విఫల ప్రధానిని చూడలేదన్నారు.

Tags:    

Similar News