చంద్రబాబు భలే చెప్పారే..

Update: 2018-06-13 02:29 GMT

గొప్పలు చెప్పుకోవడంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవరైనా అని విమర్శిస్తుంటాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా ఆయన ప్రపంచపటంలో హైదరాబాద్, సెల్ ఫోన్లు, సత్య నాదెళ్ల పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి. వీటిపై కొందరు చంద్రబాబు విజన్ ను మెచ్చుకోగా, కొందరు మాత్రం ఆయనవి కేవలం గొప్పలేనని తేల్చేస్తున్నారు. అయితే, ఏ సందర్భాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు దిట్ట. ఈ విషయాన్ని ఆయన మరోసారి నిరూపించారు.

సింగపూర్ నే విమర్శిస్తున్నారు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం సింగపూర్ తో పలు కీలక ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందాలు రాష్ట్రానికి మేలు చేస్తాయని టీడీపీ చెబుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం వీటి వల్ల రాష్ట్రం నష్టపోతుందని ఆరోపిస్తున్నారు. అయితే, ఇప్పుడు సింగపూర్ వేదికగా జరిగిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ భేటీ అవుతున్న సందర్భాన్ని రాష్ట్రానికి తెచ్చి ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టారు చంద్రబాబు నాయుడు. ప్రపంచంలోనే భిన్న ధృవాలైన ట్రంప్, కిమ్ సింగపూర్ లో భేటీ అవుతున్నారని, అటువంటి సింగపూర్ ఆంధ్రప్రదేశ్ ను నమ్మి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకురావడం గొప్ప విషయమన్నారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం సింగపూర్ ని విమర్శిస్తున్నాయని ఆరోపించారు.

Similar News