కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం?

ప్రభుత్వోద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అనేక మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడటంతో కొత్త మార్గదర్శకాలను తీసుకు వచ్చింది. ఇకపై కార్యదర్శి [more]

Update: 2020-06-09 06:38 GMT

ప్రభుత్వోద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అనేక మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడటంతో కొత్త మార్గదర్శకాలను తీసుకు వచ్చింది. ఇకపై కార్యదర్శి స్థాయి అధికారులు రోజు విడిచి రోజు మాత్రమే ఆఫీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే జలుబు, దగ్గు ఉన్న ఉద్యోగులు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, వారు వైద్యశాఖకు ఈ విషయాన్ని తెలియజేయాలని కోరింది. కంటెయిన్మెంట్ ప్రాంతంలో ఉండే ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. విధులకు హాజరయ్యే ఉద్యోగులు విధిగా మాస్క్ ధరించాలని కోరింది. ఇంటర్ కమ్ లోనే మాట్లాడుకోవాలని కేంద్రం కోరింది.

Tags:    

Similar News