సీబీఐకి ఏపీలో నో ఎంట్రీ

Update: 2018-11-16 02:03 GMT

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ కు చంద్రబాబు ద్వారాలు మూసివేశారు. ఇకపై సీబీఐ ఆంధ్రప్రదేశ్ లో దాడులు చేసే అవకాశం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల్లో సీబీఐ దాడులు చేయాలంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. దీనికి ఢిల్లీ మినహాయింపు ఉంది. అయితే కొద్దిరోజులుగా కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతుండటం, సీబీఐ దాడులు జరిగే అవకాశముందని తెలియడంతో చంద్రబాబు సర్కార్ ఈ సంచలనం నిర్ణయంతీసుకుంది.

ఇక ఏసీబీతోనే.....

సీబీఐ దాడులు చేసేందుకు అవసరమైన అనుమతి ఉత్తర్వులను ఏపీ సర్కార్ ఉపసంహరించుకుంది. దీంతో ఇక కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థలు రాష్ట్రంలోని ఉద్యోగులపై దాడులు చేసే అవకాశముండదు. సీబీఐని అడ్డంపెట్టుుని రాష్ట్రాలను బెదిరించే పరిస్థితులో మార్పులు రావాలని ఈ అనుమతిని ఉపసంహరించుకున్నట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం సీబీఐ ఇక ఏపీలో దాడులు చేసే అవకాశం లేదు. ఆ పాత్రను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏసీబీయే పోషిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Similar News