ఐఏఎస్ చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు

ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారి చంద్రకళపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆమె నివాసముంటున్న ఇంటితో పాటు స్వస్థలం కరీంనగర్ లో దాడులు కొనసాగుతున్నాయి. ఇసుక మాఫియాతో పాటు [more]

Update: 2019-01-05 08:40 GMT

ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారి చంద్రకళపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆమె నివాసముంటున్న ఇంటితో పాటు స్వస్థలం కరీంనగర్ లో దాడులు కొనసాగుతున్నాయి. ఇసుక మాఫియాతో పాటు మైనింగ్ మాఫియాతో అంటకాగి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు రావడంతో ఆమెపై అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసి ఏకకాలంలో 12 చోట్ల దాడులు చేస్తున్నారు. జలౌన్, హమీర్ పూర్, లక్నో, ఢిల్లీ ప్రాంతాలలో తనిఖీలు జరుగుతున్నాయి. విలువైన డాక్యుమెంట్లు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుని, బ్యాంకు లాకర్లను తెరిచి చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఆమె డైనమిక్ ఆఫీసర్ అని, అక్రమార్కుల పట్ల కఠినంగా ఉంటారని సామాజిక మాద్యమాల్లో హోరెత్తించారు. నిజాయితీపరురాలు, అవినీతి పరుల పాలిట సింహస్వప్నం అంటూ ప్రచారం చేశారు.

ఎల్లారెడ్డి వాసి…

కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ 2008లో ఐఏఎస్ కు ఎంపికయ్యారు. సివిల్ సర్వీసులో 409 ర్యాంకు పొందిన ఆమె యూపీ రాష్ట్రానికి కేటాయించబడ్డారు. చంద్రకళ భర్త ఏ.రాములు తెలంగాణ సాగునీటి శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రకళ అలహాబాద్, హమీర్ పూర్, మథుర, బులంద్ షహర్ లో పనిచేశారు.

Tags:    

Similar News