సీబీఐ అధికారులపై సీబీఐ విచారణ

Update: 2018-10-22 13:38 GMT

ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో సిబిఐ అధికారులే సోదాలు జరపడం సంచలనంగా మారింది. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో భారీగా నగదు చేతులు మారిన వ్యవహారంలో సీబీఐ విచారణ చేస్తోంది. సుమారు రెండు కోట్ల రూపాయలు నగదు పలువురు సీబీఐ సీనియర్ అధికారుల ద్వారా చేతులు మారిందని హైదరాబాద్ కు చెందిన వ్యాపారి సతీష్ బాబు సాన ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. మనీలాండరింగ్ హవాలా కేసులో తన పాత్ర లేకుండా చేయడం కోసం రెండు కోట్ల రూపాయలు మెయిన్ ఖరేషీ పలువురు సీబీఐ అధికారులకు ఇచ్చినట్లు సతీష్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణలో భాగంగా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థాన పై నిన్న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక, ఇదే కేసులో డీఎస్పీ స్థాయి అధికారి దేవేంద్ర కుమార్ ను ఉదయం నుంచి సీబీఐ ప్రశ్నిస్తోంది. డీఎస్పీ దేవేంద్ర కుమార్ కార్యాలయం సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఉండటంతో విచారణ అధికారులు అందులో సోదాలు జరిపారు. దేవేంద్ర కుమార్ ఛాంబర్ నుంచి 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం దేవేంద్ర కుమార్ ను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు అధికారికంగా వెల్లడించారు.

Similar News