బ్రేకింగ్ : ఏపీ, తెలంగాణాలకు సుప్రీం నోటీసులు

ఎన్నికలకు ముందు ప్రజలకు నగదును పంపిణీ చేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎన్నికలకు ముందు నగదు బదిలీ పథకాలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికలకు [more]

Update: 2019-07-02 06:43 GMT

ఎన్నికలకు ముందు ప్రజలకు నగదును పంపిణీ చేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎన్నికలకు ముందు నగదు బదిలీ పథకాలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది. తెలంగాణలో కూడా ఇదే తరహాలో నగదు బదిలీ జరిగింది. ఈ పథకాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి నగదు వెళుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. పథకాల పేరుతో నగదును బదిలీ చేయడం ఏంటని సుప్రీంకోర్టు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది

Tags:    

Similar News