ఏ క్షణంలోనైనా టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్..??

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అరెస్ట్ కు రంగం సిద్దమయింది. మహారాష్ట్రలో కాంట్రాక్టుల సందర్బంగా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పై [more]

Update: 2019-01-29 03:47 GMT

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అరెస్ట్ కు రంగం సిద్దమయింది. మహారాష్ట్రలో కాంట్రాక్టుల సందర్బంగా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పై ఇది వరకే మహారాష్ట్ర ఏసీబీ కేసు నమోదు చేసింది. మహారాష్ట్రలో నిర్మించిన వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలను పెంచి బొల్లినేని వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై గతంలో అరెస్ట్ కు మహారాష్ట్ర పోలీసులు ప్రయత్నించినా హైకోర్టు అరెస్ట్ పై స్టే ఇచ్చింది. అయితే తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయడంతో బొల్లినేని రామారావు అరెస్ట్ కు మహారాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో ఏ క్షణంలోనైనా టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అరెస్ట్ తప్పదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News