బ్రేకింగ్ : అసోం సీఎంగా హేమంత్ బిశ్వశర్మ

అసోం ముఖ్యమంత్రి అభ్యర్థిగా హేమంత్ బిశ్వశర్మ పేరును బీజేపీ కేంద్ర నాయకత్వం ఖరారు చేసింది. దీంతో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శర్వానంద్ సోనోవాల్ తన పదవికి రాజీనామా [more]

Update: 2021-05-09 06:48 GMT

అసోం ముఖ్యమంత్రి అభ్యర్థిగా హేమంత్ బిశ్వశర్మ పేరును బీజేపీ కేంద్ర నాయకత్వం ఖరారు చేసింది. దీంతో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శర్వానంద్ సోనోవాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. దీంతో హేమంత్ బిశ్వశర్మ అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తుల విష‍యంలోనూ, విజయం సాధించడంలోనూ హేమంత్ బిశ్వశర్మ కీలకపాత్ర పోషించారు. సోనోవాల్ పై బీజేపీ స్థానిక నేతల్లో అసంతృప్తి ఉండటంతో హేమంత్ బిశ్వశర్మ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రకటించింది. రేపు హేమంత్ బిశ్వశర్మ అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Tags:    

Similar News