బిగ్ బాస్ కు బిగ్ రిలీఫ్

బిగ్ బాస్ నిర్వాహకులకు ఊరట లభించింది .బిగ్ బాస్ నిర్వాహకులపై నమోదైన కేసుల్లో వారం రోజులపాటు అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది . బిగ్ [more]

Update: 2019-07-17 13:14 GMT

బిగ్ బాస్ నిర్వాహకులకు ఊరట లభించింది .బిగ్ బాస్ నిర్వాహకులపై నమోదైన కేసుల్లో వారం రోజులపాటు అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది . బిగ్ బాస్ నిర్వాహకులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. బిగ్ బాస్ షో నిర్వాకుల పై నమోదైన కేసులు కొట్టివేయలని హైకోర్టు లో క్వాష్ పిటిషన్ వేశారు..బంజారాహిల్స్, రాయదుర్గంలో పోలీస్ స్టేషన్లలో తమపై నమోదు అయిన కేసులు కొట్టివేయలని కోర్ట్ ను బిగ్ బాస్ నిర్వాహకులు కోరారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు పై నమోదు అయిన కేసుల కు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు , పిటిషనర్ కు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయవద్దని తెలిపింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News