బాలసాయిబాబా కన్నుమూత

Update: 2018-11-27 07:59 GMT

కర్నూలు బాల సాయిబాబా గుండెపోటు ఇవాళ కన్నుమూశారు. బంజారాహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు. 1960 జనవరి 14న కర్నూలులో జన్మించిన బాలసాయి తన 18వ ఏట కర్నూలులో తొలి ఆశ్రమాన్ని ప్రారంభించారు. ప్రతీ సంవత్సరం శివరాత్రికి, సంక్రాంతికి ఈ ఆశ్రమంలో ఉత్సవాలు జరిపేవారు. ఈ ఉత్సవాలకు వివిధ రంగాల ప్రముఖులతో పాటు భక్తులు పెద్దఎత్తున వచ్చేవారు. శివరాత్రికి ఆయన నోటిలో నుంచి లింగాన్ని తీసేవారు. కర్నూలు జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలులో ఆయన ఓ పాఠశాల కూడా నిర్వహిస్తున్నారు. విదేశాల్లో కూడా ఆయన ఆశ్రమానికి శాఖలు ఉన్నాయి. అదే స్థాయిలో ఆయనపై ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన నోటి నుంచి శివలింగం తీయడం మోసమని జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు వాదిస్తూ వచ్చాయి.

Similar News