కల్వకుంట్ల కవితకు చేదు అనుభవం

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఇవాళ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని రెంజల్ గ్రామంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కవిత [more]

Update: 2019-04-11 06:11 GMT

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఇవాళ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని రెంజల్ గ్రామంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కవిత వెళ్లారు. దీంతో అప్పటికే పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డ మహిళలు కవితను చూడగానే ఆమెను నిలదీశారు. ఐదేళ్లలో తమ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇళ్లు లేవని, సంక్షేమ పథకాలు అందలేదని ఆమెను నిలదీశారు. ఆమె మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో కవిత వెనుదిరిగారు.

Tags:    

Similar News