తెలంగాణలో మళ్లీ నిలదొక్కుకుంటాం

తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ [more]

Update: 2019-09-14 13:52 GMT

తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ ఇక్కడే ఆవిర్భవించిందని, అందుకే పార్టీకి ఇక్కడ పూర్వ వైభవం తెస్తానన్నారు. 9 నెలల తరువాత ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లతో సమావేశమయ్యారు. నాయకులతో సమస్యలు, పార్టీ బలోపేతం కోసం సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఒక నాయకుడు పోతే వంద మందిని తయారు చేసుకునే శక్తి టీడీపీకి ఉందన్నారు. పార్టీ కార్యకర్తలను అణగదొక్కాలని చూసినా టీడీపీ నాయకులు ఎదురొడ్డి నిలిచారని వారిని అభినందించారు. 9 నెలల తర్వాత ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన బాబుకు తెలంగాణ నాయకులు ఘన స్వాగతం పలికారు.

 

 

Tags:    

Similar News