వివాదంలోకి మరోసారి అయ్యన్న…!!

ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వితంతు మహిళల గురించి వ్యంగ్యంగా మాట్లాడి విమర్శలను [more]

Update: 2019-01-04 07:48 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వితంతు మహిళల గురించి వ్యంగ్యంగా మాట్లాడి విమర్శలను ఎదుర్కొంటున్నారు. బుచ్చయ్యపేట మండలం చిన్నపాలెంలో జరిగిన గ్రామసభలో అయ్యన్నచేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భర్త చనిపోకుండానే కొందరు పింఛన్లు అడుగుతున్నారని, వారిని వేధిస్తుంటే వదలి పెట్టకుండా ఎలా ఉంటారని అయ్యన్న జన్మభూమి వేదికగా వ్యాఖ్యలు చేశారు. భర్త చనిపోతే తాము పింఛన్లు ఇస్తాముకాని, చనిపోకుండా దుక్కల్లా ఉంటే ఎందుకు ఇస్తామని ఎదురు ప్రశ్నించారు. భర్తలను రాచిరంపాన పెట్టడం వల్లనే వారు పారిపోయారని ఎద్దేవా చేశారు. అయ్యన్న వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. అయ్యన్న మాటలు విని అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయారు.

Tags:    

Similar News