బాబుపై అయ్యన్న గరం గరం

చంద్రబాబు తీరుపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా ఉండి కష్టసమయంలో హైదరాబాద్ లో ఉండటాన్ని అయ్యన్న పాత్రుడు తప్పు పట్టినట్లు [more]

Update: 2020-09-10 02:36 GMT

చంద్రబాబు తీరుపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా ఉండి కష్టసమయంలో హైదరాబాద్ లో ఉండటాన్ని అయ్యన్న పాత్రుడు తప్పు పట్టినట్లు తెలిసింది. చంద్రబాబు ఇటీవల అమరావతి వచ్చి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఇలా పార్టీని జూమ్ యాప్ లకే పరిమితం చేస్తే ఎలా బలోపేతం అవుతామని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. పార్టీ భవిష్యత్ కోసమైనా చంద్రబాబు హైదరాబాద్ ను వీడి రావాలని ఆయన ఘాటు కామెంట్స్ చేసినట్లు పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. దీంతోనే చంద్రబాబు తాను హైదరాబాద్ వెళ్లి నారా లోకేష్ ను అమరావతికి పంపారని చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News