వివేకా హత్యపై కీలక వివరాలు చెప్పిన అవినాష్

వివేకానందరెడ్డి మృతదేహం చూసినప్పటి నుంచీ తాము అనుమానాస్పద మృతిగానే భావించామని, గుండెపోటుగా మీడియా తప్పుడు సమాచారంతో వార్తలు ప్రసారం చేసిందని వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. తాము [more]

Update: 2019-03-16 11:06 GMT

వివేకానందరెడ్డి మృతదేహం చూసినప్పటి నుంచీ తాము అనుమానాస్పద మృతిగానే భావించామని, గుండెపోటుగా మీడియా తప్పుడు సమాచారంతో వార్తలు ప్రసారం చేసిందని వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. తాము మృతదేహాన్ని చూడగానే హత్యగా అనుమానం వచ్చినా ఆయనకు ఎవరూ శత్రువులు లేరని, కనీస సమాచారం లేకుండా హత్యగా చెబితే అల్లర్లు జరుగుతాయనే విజ్ఞతతో అనుమానాస్పద మృతిగా ముందునుంచే చెప్పామన్నారు. వైఎస్ ఇంటికే వెళ్లి వివేకానందరెడ్డినే చంపామని వైసీపీ కార్యకర్తలను భయపెట్టడానికి ఈ ఘటన చేశారా అని ఆయన అనుమానించారు. శనివారం ఆయన కడపలో మీడియాతో మట్లాడుతూ… శత్రువులే లేని వివేకాను హత్య చేస్తారని తాము కూడా భావించలేదని అన్నారు. రక్తపు మడుగులో ఉండటతో చూసి అనుమానాస్పద మృతిగా భావించామన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. తర్వాత అంతా పోలీసుల ముందే జరిగిందని, పోలీసులే పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారన్నారు. తాము వచ్చేటప్పటికి ఏ లెటర్ లేదని, సాయంత్రం పోలీసులు ఈ లెటర్ బయటకు తీసుకువచ్చారని అన్నారు.

సిట్ తో ఎక్కడ న్యాయం జరిగింది..?

మీ ఇంట్లోనే వివేకానందరెడ్డినే హత్య చేస్తే మా పరిస్థితి ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఈ హత్య వెనుక అసలు దోషులు బయటకు రావాలంటే థర్ట్ పార్టీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్ పైన తమకు నమ్మకం లేదని, చంద్రబాబు వేసిన ఏ సిట్ కూడా బాధితులకు న్యాయం చేయలేదని గుర్తు చేశారు. కచ్చితంగా వాస్తవాలు బయటకు రావాలన్నారు. ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి మరణిస్తే నిష్పక్షపాత విచారణ జరపకుండా చంద్రబాబు దుష్ప్రచారం చేయాలనుకోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అని పేర్కొన్నారు.

Tags:    

Similar News