తాను అంత మంచివాడిని కాను

తాను అయ్యన్న అంత మంచి వాడిని కానని, తన జోలికి వస్తే విశాఖపట్నంలో ఉండకుండా కూడా చేయగలనని మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైరయ్యారు. గంటా శ్రీనివాసరావుపై ఆయన [more]

Update: 2019-09-02 06:20 GMT

తాను అయ్యన్న అంత మంచి వాడిని కానని, తన జోలికి వస్తే విశాఖపట్నంలో ఉండకుండా కూడా చేయగలనని మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైరయ్యారు. గంటా శ్రీనివాసరావుపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన వారిని వైసీలోకి చేర్చుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు తనను బాధించాయని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. గంటాను తాను కనీసం ఎమ్మెల్యేగా కూడా చూడనన్నారు. గంటా ఇంకా తాను మంత్రిననే ఫీలవున్నారన్నారు. విజయనగరం జిల్లా ఇన్ ఛార్జిగా ఉండి ఒక్క ఎమ్మెల్యేను కూడా గంటా గెలిపించుకోలేదన్నారు. అన్నం పెట్టిన వాళ్లకే గంటా సున్నం పెడతారన్నారు. గంటా చచ్చీ చెడీ స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

Tags:    

Similar News