అయ్యో.. అర్జున్ టెండుల్క‌ర్‌

Update: 2018-07-19 08:22 GMT

దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ త‌న బ్యాటింగ్ తో నెల‌కొల్పిన రికార్డులు మామూలివి కాదు. ఆయ‌న బ్యాట్ ప‌ట్టుకుని క్రీజ్ లోకి వ‌స్తున్నాడంటే ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టేవి. అయితే, స‌చిన్ వార‌సుడిగా క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఆయ‌న కుమారుడు అర్జున్ టెండుల్క‌ర్ మాత్రం అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లోనే డ‌కౌట్ గా వెనుదిరిగాడు. శ్రీలంక‌తో జ‌రుగుతున్న అండ‌ర్‌-19 తొలి టెస్టులో భార‌త జ‌ట్టు సెకండ్‌ బ్యాటింగ్ కి దిగింది. అల్‌రౌండ‌ర్‌గా బ్యాటింగ్‌కి దిగిన అర్జున్ 12 బంతులు ఆడి ప‌రుగులు ఏమీ చేయ‌లేదు. క‌పిల్ మిశ్రా వేసిన బంతికి ఎల్‌బీడ‌బ్యూగా వికెట్ కోల్పోయాడు. అయితే, అత‌డి తండ్రి స‌చిన్ టెండుల్క‌ర్ కూడా 1989లో పాకిస్తాన్ తో జ‌రిగిన త‌న తొలి వ‌న్‌డే మ్యాచ్ లో డ‌కౌట్ కావ‌డం గ‌మ‌నార్హం.

బౌలింగ్ లో ప‌ర్వాలేద‌నిపించి...

లెఫ్ట్ఆర్మ్ ఫేస‌ర్‌గా అంత‌కుముందు 11 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన అర్జున్ 33 ప‌రుగులు ఇచ్చి ఒక విక్కెట్ తీశాడు. రెండు మైడిన్ ఓవ‌ర్లు వేశాడు. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జ‌ట్టు 244 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గా, భార‌త జ‌ట్టు ఇప్ప‌టికే 589 ప‌రుగులు చేసి ఆట కొన‌సాగిస్తోంది.

Similar News