త్వరగా పెట్టేసి.. త్వరగా ముగించేసి?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15 లేదా 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీతో ఓట్ ఆన్ అకౌంట్ [more]

Update: 2020-06-08 02:38 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15 లేదా 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీతో ఓట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు కాలపరిమితి ముగియనుండటంతో విధిగా సమావేశాలు జరపాల్సి ఉంది. అందుకే ప్రభుత్వం శాసనసభ సమావేశాలకు సిద్ధమవుతోంది. తొలిరోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 18వ తేదీన ఆర్థిక మంత్రి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 19వ తేదీన ఎటూ రాజ్యసభ ఎన్నికలు ఉండటంతో మూడు రోజుల ముందుగా సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. బడ్జెట్ సమావేశాలు నాలుగు అయిదు రోజులకు మించి జరగే వీలు లేదు. కరోనా కారణంగా త్వరగా ముగించేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News