మానటరింగ్ లేకుంటే అంతే

రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానున్న సచివాలయాల ఏర్పాటు సన్నాహాలపై [more]

Update: 2019-09-11 10:28 GMT

రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానున్న సచివాలయాల ఏర్పాటు సన్నాహాలపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. ప్రజల సమస్యలపై స్థానికంగా స్పందించడానికి గ్రామ సెక్రటేరియట్‌కు ప్రత్యేకంగా ఒక నంబర్‌ ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లకు ఉద్దేశించిన కాల్‌ సెంటర్‌లలో ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఫిర్యాదులు, సమస్యలను నివేదించడానికి 1902 కాల్‌సెంటర్‌ను సిద్ధంచేస్తున్నామన్నారు.

సంక్షేమ పథకాలపై…..

అదే విధంగా… జాబ్‌చార్టు ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కేటాయించిన విధులపై కూడా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి తనకు కేటాయించిన పనుల విషయంలో ప్రజలకు పూర్తి సహాయకారిగా ఉండాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థలపై మానిటరింగ్‌ చాలా ముఖ్యమన్నారు. నాలుగు లక్షల మందితో పనిచేయించుకోవడం చాలా ప్రాధాన్యత ఉన్న అంశమని, మానిటరింగ్, సమీక్ష లేకపోతే… ఫలితాలు రావన్న విషయాన్ని గుర్తించుకోవాలని అధికారులకు జగన్ సూచించారు. అదే విధంగా సంక్షేమ పథకాల అమలు ప్రణాళికలపై కూడా సమీక్ష జరిపారు సీఎం జగన్.

 

Tags:    

Similar News