ఏపీ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేను చేయాలని నిర్ణయించింది. ప్రతి సరిహద్దుకు జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించింది. ప్రతి భూమికి సబ్ [more]

Update: 2020-12-18 09:00 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేను చేయాలని నిర్ణయించింది. ప్రతి సరిహద్దుకు జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించింది. ప్రతి భూమికి సబ్ డివిజన్ ప్రకారం మ్యాప్ చేయాలన్న నిర్ణయాన్ని మోదించింది. సమగ్ర ల్యాండ్ రికార్డులు తయారు చేయడం ద్వారా రైతుల భూములకు రక్షణ దొరుకుతుంది. దీనివల్ల భూ ఆక్రమణలను నిరోధించినట్లవుతుంది. ఏఫీ పర్యాటక పాలసీని మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. కరోనాతో దెబ్బతిన్న పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీలను ఇవ్వాలని నిర్ణయించింది. కొత్త పర్యాటక విధాంలో హోటళ్లు, రెస్టారెంట్లు, వాహనాల వంటి వాటికి 198 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.

Tags:    

Similar News