అసెంబ్లీలో అచ్చెన్నా వర్సెస్ విష్ణు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. బీజేపీకి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ [more]

Update: 2019-02-01 08:47 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. బీజేపీకి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలని అచ్చెన్న.. విష్ణుకుమార్ రాజును ప్రశ్నించారు. మరి, టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఎందుకు రాజీనామా చేశారని విష్ణు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించిన స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయడం లేదని ప్రశ్నించారు. ఇక, ప్రత్యేక హోదాపై జగన్ పోరును తీవ్రతరం చేశాక గత్యంతరం లేక టీడీపీ యూటర్న్ తీసుకుందని ఆయన ఆరోపించారు. మొన్నటివరకు, బీజేపీ, జగన్, పవన్ ను కలిపి తిట్టిన టీడీపీ.. ఇప్పుడు పవన్ ను మినహాయించిందన్నారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం విష్ణుకుమర్ రాజుపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న వారికి ఊడిగం చేసేందుకు సిగ్గుండాలని అన్నారు.

Tags:    

Similar News