బ్రేకింగ్ : అచ్చెన్నాయుడు అరెస్ట్ ను నిర్ధారించిన ఏసీబీ

2014 నుంచి 2019 వరకూ ఈఎస్ఐ లో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక ఇచ్చిందని ఏసీబీ అధికారులు తెలిపారు. తాము కూడా [more]

Update: 2020-06-12 04:43 GMT

2014 నుంచి 2019 వరకూ ఈఎస్ఐ లో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక ఇచ్చిందని ఏసీబీ అధికారులు తెలిపారు. తాము కూడా దీనిపై దర్యాప్తు చేశామనిచెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలు జరిగాయనితెలిపారు. మందులు, పరికరాలు కొనుగోళ్లలో అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయిందన్నారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో వంద శాతం ఎక్కువ ధరకు కాంట్రాక్టు ఇచ్చారన్నారు. మొత్తం 980 కోట్ల కొనుగోళ్లలో 150 కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించామన్నారు. ఇందులో అధికారులతో పాటు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని నిర్ధారణ అయిందన్నారు. వీరందరినీ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరపరుస్తామని చెప్పారు.

Tags:    

Similar News