ఆ కార్లు కొన్నొళ్లకి కష్టాలే… కేసులు తప్పవట

హైదరాబాద్ నగరంలోని ప్రముఖుల మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది.. కస్టమ్ డ్యూటీని ఎగ్గొట్టి విదేశాల నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్న ప్రముఖులకు ఇప్పుడు ఇబ్బందులు ఎదురు [more]

Update: 2021-07-21 04:00 GMT

హైదరాబాద్ నగరంలోని ప్రముఖుల మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది.. కస్టమ్ డ్యూటీని ఎగ్గొట్టి విదేశాల నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్న ప్రముఖులకు ఇప్పుడు ఇబ్బందులు ఎదురు కాక తప్పదు. ముంబైకి చెందిన ఓ ముఠా ఆధ్వర్యంలో కార్లను దిగుమతి చేసుకున్న ప్రముఖులు పైన డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారు. ఇందుకు సంబంధించి ప్రముఖుల జాబితా ఇప్పటికే కలెక్ట్ చేసింది. విదేశీ రాయబారులను అడ్డంగా పెట్టుకుని పెద్ద మొత్తంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మణిపూర్ లోని ఒక మారుమూల షోరూం పేరుమీద ఈ కారు ల దిగుమతి కొనసాగింది. కోటి రూపాయలకు మించి ఖరీదైన కార్లను దిగుమతి చేసుకున్న ప్రముఖుల జాబితాను ఇప్పటికే డి ఆర్ ఐ సిద్ధం చేసింది. ఈ జాబితాలో ఉన్న ప్రముఖులను ప్రశ్నించే అవకాశం ఉంది. అంతే కాకుండా కార్ల దిగుమతి ఎక్కడ నుంచి చేసుకున్నారు. ఎవరు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం డి ఆర్ ఐ చేయబోతుంది. విదేశీ రాయబారులను అడ్డం పెట్టుకొని ఈ కార్లను దిగుమతి కొనసాగిందని అనుమానం. ఈ కార్లను దిగుమతి వెనకాల ముంబైకి చెందిన ఒక ముఠా పని చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు . ఇంతేకాకుండా మణిపూర్ లోని ఒక కార్ల షోరూం పేరుమీద వీటిని ఇండియాకు కార్లను రప్పించి నట్లుగా అధికారుల ఉన్న వద్ద సమాచారం వచ్చింది. మణిపూర్ లోని కార్ షో రూమ్ దగ్గర్నుంచి అధికారులు డాటా మొత్తాన్ని కలెక్ట్ చేశారు. హైదరాబాద్ లో చాలా మంది సినీ వ్యాపార వేత్త తో పాటుగా చాలా మంది ప్రముఖులు కూడా విదేశీ లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నారు. అయితే కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టి కార్లను దిగుమతి చేసుకున్న వారి దగ్గర నుంచి డబ్బులను డి ఆర్ ఐ వసూలు చేయబోతుంది. అంతే కాకుండా వీరిపై కేసు నమోదు చేసి విచారణ కూడా చేయబోతున్నారు.

Tags:    

Similar News