పోలవరం స్పిల్ వే పనుల్లో ప్రధాన అంకం పూర్తి

పోలవరం స్పిల్ వే పనుల్లో మరో ప్రధాన అంకం పూర్తయింది. స్పిల్ వే కు గడ్డర్లను అమర్చారు. ప్రపంచంలోనే భారీ స్పిల్ వే నిర్మాణంతో అదే స్థాయిలో [more]

Update: 2021-02-27 02:52 GMT

పోలవరం స్పిల్ వే పనుల్లో మరో ప్రధాన అంకం పూర్తయింది. స్పిల్ వే కు గడ్డర్లను అమర్చారు. ప్రపంచంలోనే భారీ స్పిల్ వే నిర్మాణంతో అదే స్థాయిలో భారీ గడ్డర్ల వినియోగించారు. అతితక్కువ కాలం అంటే 60 రోజుల్లోనే 192 గడ్డర్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ అమర్చింది. వీటిని నిరంతరం ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ అధికారులు పర్యవేక్షించారు. స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణం లో గడ్డర్లు కీలకం. స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణానికి మొత్తం 192 గడ్డర్ల వినియోగించారు. స్పిల్ వే పై గడ్డర్లు, షట్టరింగ్ పనులతో స్లాబ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కోగడ్డర్ సరాసరి 23 మీటర్లు పొడవు, 2 మీటర్లు ఎత్తు ఉంది. ఒక గడ్డర్ తయారీకి 10 టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు. మొత్తం గడ్డర్ల తయారీకి 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడారు. పిబ్రవరి 17వ తేదీన గడ్డర్ల తయారీ మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రారంభించింది. గడ్డర్లను పిల్లర్లపై పెట్టడానికి 200 టన్నుల రెండు భారీ క్రేన్ల వినియోగించారు. గోదావరికి భారీ వరదలు వచ్చినా పనులు ఆగకుండా స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం చేపట్టారు.

Tags:    

Similar News