హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లో మరొక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాచారం ఇండస్ట్రీ ఏరియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్దమొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లింది. ప్లాస్టిక్ కుర్చీలు తయారుచేసే [more]

Update: 2021-04-21 00:47 GMT

హైదరాబాద్ లో మరొక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాచారం ఇండస్ట్రీ ఏరియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్దమొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లింది. ప్లాస్టిక్ కుర్చీలు తయారుచేసే కంపెనీలో మంటలు చెలరేగాయి. వెల్డింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా నిప్పూ రవ్వలు ప్లాస్టిక్ మీద పడ్డాయి. దీంతో మంటలు ఒక్కసారిగా ఉధృతంగా లేచాయి . ఈ సమయంలో పనిచేస్తున్న కార్మికులు అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చారు . కొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరందరినీ వెంటనే స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కంపెనీలో పెద్ద ప్లాస్టిక్ పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయి. దట్టమైన పొగలు దాదాపు సిటీ లోని ఏ మూల నుంచి చూసిన కూడా కనపడతాయి. నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలను ఆర్పడానికి చాలా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ నిల్వలు ఉండటం వల్ల మంటలను అదుపులోకి తెచ్చేందుకు కష్టపడాల్సి వచ్చింది.

Tags:    

Similar News