ఇది కదా పుత్రోత్సాహం అంటే..!

Update: 2018-10-29 06:24 GMT

ఏ తండ్రి అయినా భవిష్యత్ లో తన పిల్లలు మంచి స్థానంలో ఉండాలనుకుంటాడు. పిల్లల జీవితంపై ఎన్నో కలలు కంటారు. అందుకోసం జీవితంలో వారు ఎన్నో త్యాగాలు చేసి పిల్లలకు చదివిపిస్తారు. అయితే, కొందరు తల్లిదండ్రుల నమ్మకాలను వమ్ము చేసేవారైతే... కొందరు వారి కలలను నెరవేర్చేవారుంటారు. ఇటువంటి వారిలో ఒకరు ఉత్తరప్రదేశ్ లో ఐపీఎస్ అధికారి అనూప్ సింగ్. అనూప్ సింగ్ ఉన్నావ్ నుంచి ట్రాన్స్ ఫర్ అయి ఇప్పుడు రాజధాని లక్నో(నార్త్) ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విశేషమేమితంటే... ఆయన తండ్రి జనార్ధన్ సింగ్ నగరంలోని విభూతిఖంద్ పోలీస్ స్టేషన్ లో ఒక సాధారణ కానిస్టేబుల్. అంటే, జనార్ధన్ సింగ్ కి ఇప్పుడు కుమారుడే బాస్ అన్నమాట.

కుమారుడికి సెల్యూట్ చేస్తా...

కుమారుడి కింద పనిచేయడం గర్వంగా ఉందని చెబుతున్నాడు జనార్ధన్ సింగ్. డ్యూటీలో భాగంగా కుమారుడిని కలిసినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సెల్యూట్ చేస్తా అంటున్నారు. ఇక తన తండ్రి నుంచి ఎన్నో నేర్చుకుని ఈ స్థాయికి వచ్చానని అనూప్ సింగ్ అంటున్నారు. ఇద్దరు ఒకేచోట పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. అయితే, వ్యక్తిగత జీవితం వేరు, ఉద్యోగ జీవితం వేరు అని... ఇద్దరమూ మా బాధ్యతలను సరిగ్గా నెరవేర్చేందుకు పనిచేస్తామన్నారు. జనార్ధన్ సింగ్ - కాంచన్ దంపతులకు అనూప్ ఏకైక కుమారుడు. ఒక్క కుమారుడు తండ్రితోనే సెల్యూట్ చేయించుకునే స్థాయికి ఎదిగారంటే తండ్రికి అంతకు మించిన పుత్రోత్సాహం ఇంకేముంటుంది.

Similar News