Amith shah : ఎన్నికల ప్రచారానికి అమిత్ షా

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి అమిత్ షా రానున్నారు. దసరా పండగ తర్వాత ఆయన వచ్చే అవకాశముంది. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం [more]

Update: 2021-10-13 04:20 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి అమిత్ షా రానున్నారు. దసరా పండగ తర్వాత ఆయన వచ్చే అవకాశముంది. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం కోసం అమిత్ షా వస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తేదీ ఖరారు కాకపోయినప్పటికీ ప్రచార తేదీ ముగిసే లోపు అమిత్ షా హుజూరాబాద్ రానున్నారు. అదే విధంగా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

జేపీ నడ్డా కూడా….

హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ నాయకులను ఇక్కడకు రప్పించే ఆలోచనలో ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రానున్నారు. ఆయన రోడ్ షోలో పాల్గొనే అవకాశముంది. వీరితో పాటు కేంద్ర మంత్రులు కూడా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

Tags:    

Similar News