ఏబీ ఇలా లైన్ లోకి వస్తున్నారా?

తనను ప్రభుత్వం అక్రమంగా సస్పెండ్ చేసిందని, బదిలీ చేసిందని మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపన హైకోర్టు పూర్తి వివరాలను [more]

Update: 2020-04-23 01:49 GMT

తనను ప్రభుత్వం అక్రమంగా సస్పెండ్ చేసిందని, బదిలీ చేసిందని మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపన హైకోర్టు పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం మారిన వెంటనే అధికారులను ఎలా బదిలీ చేస్తారని, ఇందుకు కారణాలు తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసును పది రోజులకు వాయిదా వేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరావును తొలుత ఇంటలిజెన్స్ చీఫ్ నుంచి బదిలీ చేసింది. ఆ తర్వాత సస్పెండ్ చేసింది. అయితే ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని నిర్ధారించింది. క్యాట్ సయితం ఏబీ వెంకటేశ్వరావు విషయంలో ఏమీ చేయలేమని చెప్పింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News