పెళ్లి పేరు చెప్పి 10 లక్షల రూపాయల టోకరా

మ్యాట్రిమోనీ డాట్ కాం లో తన ప్రొఫైల్ అప్ లోడ్ చేసేందుకు 10 లక్షల రూపాయలు మోసపోయారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నుంచి 10 లక్షల పైచిలుకు [more]

Update: 2021-05-04 01:20 GMT

మ్యాట్రిమోనీ డాట్ కాం లో తన ప్రొఫైల్ అప్ లోడ్ చేసేందుకు 10 లక్షల రూపాయలు మోసపోయారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నుంచి 10 లక్షల పైచిలుకు కొట్టేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. ఈమేరకు సైబర్ క్రైమ్ ఏసిపి కె.వి ప్రసాద్ కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. పెళ్లి పేరుతో యువతిని 10 లక్షల 50 వేలు రూపాయలు మోసం చేసిన ఘరానా మోసగాడు పై కేసు నమోదైంది. తెలుగు మ్యాట్రిమోనీ లో హైదరాబాద్ బేగంపేట కు చెందిన ఓ సాఫ్ట్ వెర్ ఉద్యోగిని తన ప్రొఫైల్ ని మ్యాట్రిమోనీ లో అప్డేట్ చేశారు..మునగర్స్.మేహుల్ కుమార్ అనే వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో పని చేస్తున్నానని చెప్పి యువతితో పరిచయం పెంచుకున్నాడు. అమెరికాలో కీలకమైన పదవులు తాను విధులు నిర్వహిస్తున్న అంటూ నమ్మబలికాడు. యువతి ప్రొఫైల్ నచ్చిందని తనను వివాహం చేసుకోవడానికి అంగీకారమే అని చెప్పి తన తో పరిచయం ఏర్పడింది. ఒక దశలో వీసా పంపిస్తానని 50 వేల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పగా తను తన ఎకౌంట్లో 50 వేల రూపాయలను యువతి చేత డబ్బులు డిపాజిట్ చేయించాడు. ఇంకొక దఫా లో లో గుజరాత్ లో ఇల్లు కొన్నానని దానికి రేనివేషన్ చెయ్యాలని 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని, తన అకౌంట్ లో 10 లక్షల రూపాయలను నిందితుడు జమ చేయించుకున్నాడు. పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో తను మాట దాటడంతో ఆమెకు అనుమానం వచ్చి ఎంక్వయిరీ చేయగా తాను మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

Tags:    

Similar News